Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో కీచక టీచర్ అరెస్ట్
శ్రీనగర్: విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించిన ఓ కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన ఘటన జమ్మూకాశ్మీర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... రాష్ట్రంలోని దోడా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే ఎస్కే మన్హాస్(46) అనే టీచర్... అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక(13)ను క్లాస్‌రూంలోకి పిలిచి లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాలిక స్కూల్ ఆమె తల్లిదండ్రులకు, యాజమాన్యానికి చెప్పడంతో సదరు ఉపాధ్యాయుడు స్కూల్ నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అతడి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ బయట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.