Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్గావ్: కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన కూతురుపైనే లైంగికదాడికి పాల్పడ్డాడో కీచక తండ్రి. ఈ ఘటన హర్యానాలోని గుర్గావ్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి (38) గుర్గావ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి నలుగురు పిల్లలు. తన మొదటి భార్య కూతురు (12)పై ఆరు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. పైగా ఆ బాలికతో.. 'ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. ప్రతీ తండ్రికి ఆయన కూతురుతో లైంగిక సంబంధం ఉంటుంది. దీన్ని గురించి బయట చెప్తే చంపేస్తా' అంటూ ఆమెను బెదిరించాడు. ఆ బాలిక ఈ విషయాన్ని తన సవతితల్లికి చెప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె.. శుక్రవారం పని నుంచి త్వరగా ఇంటికి వచ్చింది. అదే సమయంలో ఆమె భర్త బాలికను లైంగికంగా వేధించడం చూసి విస్తుపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిపై పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన ఆ కీచకుడిని ఉరి తీయాలంటూ మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి.