Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: తొమ్మిదేండ్ల బాలికపై ఓ కీచకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఉన్నావోలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం గంగానది ఒడ్డున స్థానికంగా జరిగే ప్రదర్శన సందర్శించిడానికి వెళ్లింది. కాగా కుటుంబ సభ్యులంతా నదిలో స్నానాలకు వెళ్లడంతో అక్కడ ఒంటరిగా ఉన్న బాలికను వారితో పాటు వచ్చిన డ్రైవర్ కుమారుడు చోటు(25) ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు బాలికను వెతకటంతో పక్కన ఉన్న పొదల్లో కనిపించింది. వారు ఆమెను ప్రశ్నించటంతో జరిగిన విషయాన్ని వివరించింది. ఫిర్యాదు నిమిత్తం భాదితురాలి తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఔరాస్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కానీ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. వేరే స్టేషన్కు వెళ్లాలంటూ సలహా ఇచ్చారు. దీంతో భాదితురాలి కుటుంబం సఫీపూర్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.