Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలోని బులంద్‌షహర్‌లో దారుణం
లక్నో: పదిహేనేండ్ల బాలికపై పది మంది దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... బులంద్‌షహర్ జిల్లాలోని చచేరీ గ్రామానికి చెందిన బాలిక తన కుటుంబసభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగిన నిశ్చితార్థపు వేడుకకు వెళ్లింది. అక్కడే టెంట్ వేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు... పక్క ఊరిలో ఉన్న గుడికి వెళ్దామని ఆ బాలికను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లారు. సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. మరుసటి రోజు ఉదయం పొలంలో అచేతనంగా పడిఉన్న బాధితురాలిని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను తీసుకెళ్లిన ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేయగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.