Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాల సీజన్ లో విహారానికి పెరుగుతున్న ఆదరణ
- గత ఏడాదితో పోలిస్తే, పాతిక శాతం పెరిగిన బుకింగ్స్
- అమెరికా, యూరప్ కంటే దక్షిణాసియా నగరాలకే ఇండియన్స్ మొగ్గు
- బెస్ట్ ఆప్షన్స్‌గా నిలిచిన సింగపూర్, దుబారు: కయాక్ సర్వే
- స్వదేశంలో ఉదరు పూర్, తిరుపతిలదే పైచేయి!
కడవేర్గు
ఆనందించే మనసు, ఆహ్లాదంతో ఉప్పొంగే హృదయం ఉండాలే గానీ, సీజన్‌తో పనిలేకుండా విహారంలో తేలియాడొచ్చు అంటున్నారు పర్యాటక ప్రేమికులు. ఇప్పటివరకూ.. విహారయాత్ర లకు వేసవే సరైన సమయమన్న భావన ఉండేది. ఐతే, గత కొంత కాలంగా ఈ అభిప్రాయం మారుతోందని, మాన్సూన్ టూర్స్ కు సైతం ట్రావెలర్స్ నుంచి మంచి స్పందన వస్తున్నట్టు గ్లోబల్ ట్రావెల్ సర్చ్ ఇంజన్ 'కయాక్' తాజా సర్వేలో వెల్లడైంది.
దక్షిణాసియా నగరాలే ఫస్ట్ ఛాయిస్
ఈ వర్షాకాల సీజన్ లో విహారయాత్రల కోసం అన్వేషించిన పర్యాటకులు గత సంవత్సరంతో పోలిస్తే, పాతిక శాతం పెరిగినట్టు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ట్రావెల్ సర్చ్ ఇంజన్ 'కయాక్' పేర్కొంది. న్యూయార్క్, లండన్, పారిస్ తదితర ప్రాంతాల కంటే దక్షిణ ఆసియా నగరాలు సింగపూర్(113%), దుబారు(107%), బ్యాంకాక్(57%)ల విహారానికే భారతీయులు మక్కువ చూపుతు న్నట్టు సదరు సర్వే తేల్చింది. ఇక, భారతదేశంలో(డొమెస్టిక్ డెస్టినే షన్స్) ఎక్కువ మంది రాజస్థాన్ లోని ఉదరు పూర్(88%) టూర్ కి వెళ్లాలని ఆశిస్తే, తర్వాతి స్థానంలో తిరుపతి(68%) ఉన్నది. ఇక, బ్యాంకాక్ వంటి దగ్గరి ప్రాంతాలకు దేశీయ పర్యాటకులు ఒక వారం వ్యవధిని కేటాయిస్తే.. చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి దూర పు నగరాల్లో గడపడానికి ఏకంగా నెలరోజుల పాటు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్టు సర్వే ప్రతినిధులు తెలిపారు. కాగా, జూన్ 15 నుంచి ఆగస్టు31 మధ్య బుకింగ్ చేసుకున్న/ సర్చ్ చేసిన టూర్ తేదీలను విశ్లేషించి ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది.
నిశిరాత్రి తార - సింగపూర్
ప్రపంచంలో అత్యున్నత పర్యాటక ప్రదేశాల్లో సింగపూర్ నగరం మొదటి వరుసలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆకాశాన్నంటే భవనాలు, అందంగా వెలుగు జిలుగులతో మెరిసే షాపింగ్ మాల్స్‌తో పాటు నిశిరాత్రి చీకటి గుహల్లో క్రూర జంతువులను వీక్షింపజేసే నైట్ సఫారీ, 600జాతులకు చెందిన సుమారు పది వేల పక్షులకు నెలవైన జురాగ్ పక్షి కేంద్రంతో పాటు సముద్రంలోపల వింతలూ విశేషాల సమాహారం అండర్ సీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియో థీమ్‌పార్క్ , సెంటసో ద్వీపం (కేబుల్ కార్), బొటానికల్ గార్డెన్ తదితరాలు యాత్రికులను చూపుతిప్పు కోకుండా చేస్తాయి.
చౌక ధరలో అద్భుత అందాలు : బ్యాంకాక్
ఎన్నో సుందర ప్రదేశాల తో అల రారుతూ.. చవకైన యాత్రా ప్యాకేజీగా చెప్పు కునే బ్యాంకాక్ సందర్శనా నికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. క్రాబి ప్రావిన్స్ లో ఉన్న ఫిఫి ద్వీప సమూహం, సముద్రం మధ్యలో చిన్న చిన్న కొండలతో ఎంతో అందంగా ఉండే పాంగ్ ఎన్జీయే అందాలు, గ్రాండ్ ప్యాలస్, ప్రపంచంలో ఐదు శాతం జంతు జాతులకు నిలయమైన ఖావో సాక్ నేషనల్ పార్క్, ముకోచాంగ్ నేషనల్ పార్క్, కాంచన బురి నుంచి క్వారు నది వంతెన మీదుగా నామ్ టోక్ వరకు ఉండే బర్మా డెత్ రైల్వేలో ప్రయాణం, ప్రతి నెలా పున్నమి నాడు ఎంతో వైభవంగా జరిగే కో ఫాంగాన్ ద్వీపం ఫుల్ మూన్ పార్టీ, సూర్య దేవాలయం, నైట్ బజార్ వంటి పలు ప్రాంతాలు టూరిస్టులను అలరిస్తాయి. కాగా, వివిధ భారతీయ భాషల్లో నిర్మితమయ్యే సినిమాల షఉటింగ్స్ లకు బ్యాంకాక్ చిరునామాగా నిలుస్తుండటం తెలిసిందే!
సరస్సుల ఉదరు పూర్.. సప్త గిరుల తిరుపతి
రాజస్థాన్ అనగానే ఎడారులు గుర్తొస్తాయి. కానీ ఉదరుపూర్ మాత్రం పచ్చదనంతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఆరావళి పర్వత శ్రేణుల మధ్య.. సరస్సుల నడుమ కొలువుదీరిన ఈ రాజప్రాసాదాల నగరాన్ని వీక్షించడానికి స్వదేశంలోని వాళ్ళే కాకుండా విదేశీ యులు సైతం ఆసక్తి కనబరుస్తారు. రాజరిక పాలన లోని కళాత్మక భవంతులు, రాణాప్రతాప్ మ్యూజి యం, సరస్సులు, నగరం చుట్టూ ప్రొటెక్షన్ వాల్, ఏడు ద్వారాలు, సహేలియోంకీ బరీ (రాణి ఉద్యా నవనం), గులాబ్భాగ్ (వీకెండ్ పిక్నిక్ స్పాట్), దీన్‌దయాళ్ పార్క్, జగదీశ్ ఆలయం వంటివి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. ఇక, భారతదేశంలోని ఆధ్యాత్మిక యాత్రా స్థలాల్లో ఒకటైన తిరుపతిలో డీర్ పార్క్, ప్రకృతి రమణీయతను నిలుపుకున్న కొండలు, జలపాతాలను ఇక్కడ దర్శించవచ్చు.
ఎడారి సిగలో మణిహారం : దుబాయ్
అద్భుతమైన పర్యాటక సోయగాలు, జలపాతాలు, సముద్రతీరాలు, ఆకాశాన్నంటే అధునాతన భవనాలు, నోరూరించే రుచులు ఇలా ఒక్కటేమిటీ సందర్శకులకు సాదర ఆహ్వానం పలకడంలో దుబారు శైలే విభిన్నం. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన బుర్జ్ ఆల్ ఆరమ్ టవర్ (సముద్రం మధ్యలో ఉంది) మరియు టవర్ బూర్జ్ కల్లీపా టవర్ తో పాటూ వాటర్ కేవ్స్, ఎలికాప్టర్, సీబస్, కైట్బీచ్, జుబేరా బీచ్, ఓల్డ్ దుబారు, అబుదాబీ మాస్క్, బోటింగ్ స్పాట్స్, ఆర్కెస్ట్రా, వాటర్ వరల్డ్, ఐఎంజి వరల్డ్, వైల్డ్ వాడీ, సిటీవాక్, అట్లాంటిస్, గ్లోబల్ విలేజ్, దుబారు మాల్ వంటి వందల సంఖ్యలో చూడదగ్గ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఎడారిలో మోటారు వాహనాలు, ద్విచక్రవాహనాలలో చేసే డజర్డ్ సఫారీ, సముద్రంలో బోటింగ్, బైకింగ్ జీవితంలో గుర్తుండిపోయే మధురక్షణాలుగా మిగిలిపోతాయి. ఇక, దుబారు స్పెషల్ వంటకాలైన లెబనీస్, అరబిక్ ఫుడ్ తో పాటూ యుఎఇ స్పెషల్ స్వీట్ కునాఫీ, అరబిక్ కాఫీ రుచి చూడాల్సిందే!