Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 96 నకిలీ స్ధిరనివాస ధ్రువీకరణ పత్రాలు
- గుజరాత్ హైకోర్టుకు వెల్లడి
అహ్మదాబాద్: గుజరాత్ మెడికల్ అడ్మిషన్లలో 96 నకిలీ స్థిరనివాస ధ్రువీకరణ పత్రాలను సూరత్పోలీసులు గుర్తించారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో 'స్థిరనివాస ధ్రువీకరణపత్రాల'పై దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న గుజరాత్ హైకోర్టుకు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. 'వీరిలో 13 మంది మొదటి దశలోనే అడ్మిషన్లు పొందారు. ఇందులో ఏడుగురు అడ్మిషన్ కోసం రిపోర్ట్ చేశారు' అని గుజరాత్(స్థిరనివాసం) పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వసంత్ పటేల్ తెలిపారు. మెడికల్ సీట్లలో 85శాతం స్థానిక విద్యార్థులకు కేటాయిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైద్య విద్యలో అడ్మిషన్స్ కోసం స్థిరనివాస ధ్రువీకరణపత్రాన్ని తప్పనిసరి చేస్తూ 'నీట్'కు ముందు గుజరాత్ ప్రభుత్వం నిబంధనను సవరించింది. ఈ నిబంధనతో 4,050 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసిన 24 ప్రభుత్వ, ఇతర కాలేజీలపై ప్రభావం పడింది.