Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భం దాల్చిన చిన్నారి... బీహార్‌లో మరో ఘోరం
పాట్నా: విద్యాబుద్ధులు నేర్పించాల్ని ఉపాధ్యా యులే దారితప్పి అభం శుభం తెలియని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా మహిళల నుంచి, పసిపాపల వరకు అందరూ మానవ మృగాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. పదేండ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ తొమ్మిది నెలల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... పూల్వారి షరీఫ్‌లోని ఓ పాఠశాలతో ఐదో తరగతి చదువుతున్న చిన్నారిని బెదిరింపులకు గురిచేస్తూ స్కూల్ ప్రిన్సిపాల్ ఘాతుకానికి పాల్పడ్డాడు. అదే స్కూల్లో పనిచేసే క్లర్క్ ఈ విషయాన్ని తెలుసుకొని బాలికను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికదాడికి ఒడి గట్టాడు. అయితే గత కొద్ది రోజులుగా బాలిక అనారో గ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంతో ఉన్నట్టు నిర్ధారించడంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. జరిగిన విషయాన్ని బాధితురాలు వివరించగా వారు వెంటనే పోలీసులను ఆశ్రయిం చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సదరు ప్రిన్సిపాల్, క్లర్క్‌లను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.