న్యూఢిల్లీ: భారత నూతన సొలిసిటర్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా బుధవారం నియమితులయ్యారు. ఎస్‌జీఐగా మెహతాను నియామకానికి అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్(ఏసీసీ) ఆమోదం తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో రంజిత్ కుమార్ ఎస్‌జీఐ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో మెహతాను ఆ పదవికి ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 జూన్ 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.