Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ప్రతీ ఆదివారం ఆస్తిపన్ను వివాదాల పరిష్కారం..
  • నేడు దళిత స్త్రీ శక్తి రాష్ట్ర సదస్సు..
  • ఐసీయూ స్టెప్‌డౌన్‌ గదిలోకి మధులిక..
  • వీరజవాన్ల కుటుంబాలకు రెవెన్యూ విరాళం..
  • సనత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఆర్థికరంగం అధ్వాన్నం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఆర్థికరంగం అధ్వాన్నం

Thu 11 Oct 06:48:09.241773 2018

- ఉపాధి, ఉద్యోగరంగాలు దెబ్బతిన్నాయి
-  ముందు ముందు పరిస్థితులు మారేట్టు లేవు : ఆర్‌బీఐ 'కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌' సర్వేలో వెల్లడి
నిరుద్యోగం, నిత్యావసర ధరలు...సామాన్యుడ్ని భయపెడుతున్నాయి. ఇంధన ధరల సంగతి ఇక చెప్పక్కర్లేదు. వాహనదారుల మొహంలో సంతోషం కరువైంది. మొత్తంగా చూస్తే..దేశ ఆర్థికరంగం అధ్వాన్నంగా తయారైంది. ఈ మాట అంటున్నది ప్రతిపక్ష పార్టీల నాయకులు కాదు. ఆర్‌బీఐ తాజా సర్వే 'కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌'లో 13నగరాల్లోని ప్రజాభిప్రాయం ఇది.
న్యూఢిల్లీ : ఒక గొప్ప పరివర్తన దిశగా భారతదేశం పయనిస్తోందని, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని...విదేశాల్లో ప్రచా రం బాగానే చేసుకుంటున్నాంగానీ, ఇందులో ఇసుమంతైనా నిజం లేదని 'ఆర్‌బీఐ' తాజా సర్వే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఆర్థిక పరి స్థితి అధ్వాన్నంగా తయారైందని సర్వేలో పాల్గొన్న 44శాతం మంది అభిప్రాయపడగా, ఇంతకు ముందు ఎలా ఉందో...ఇప్పుడూ అలాగే ఉందని 22శాతం మంది తెలిపారు. కేవలం 34శాతం మంది మాత్రమే ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధి రంగాలు ఘోరంగా తయారయ్యాయని 45.5శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోలానే ఉందని 19 శాతం మంది చెప్పారు. ఇక నిత్యావసర ధరల పెరుగుదలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. సరకులు ధరలు పెరగటమేగానీ, తగ్గిన దాఖలా లేదని 88శాతం మంది చెప్పారు. ధరలు తగ్గాయని కేవలం 3శాతం మంది మాత్రమే చెప్పారు. తమ రోజువారీ వ్యయం దారుణంగా పెరిగిపోయిందని 78శాతం మంది వాపోయారు.
-  దేశవ్యాప్తంగా 13నగరాల్లోని 5,360 కుటుంబాల్లో 'ఆర్‌బీఐ' తాజా సర్వే సాగింది. ప్రతీ మూడు నెలలకోమారు ఆర్‌బీఐ ఈ సర్వే నిర్వహిస్తుంది. 'ముందు ముందు పరిస్థితులు మెరుగుపడతాయా?' అని సర్వేలో అడగ్గా, 'ఏం మారదు' అనే అత్యధికమంది చెప్పారు.
- సెప్టెంబరునాటికి సేకరించిన 'సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ' ప్రకారం, నిరుద్యోగం 6.7శాతంగా నమోదైంది. మరోవైపు కార్మికశక్తిలో మహిళ భాగస్వామ్యం క్రమంగా పడిపోతోంది. ఈ ఏడాది మే-ఆగస్టు మధ్యకాలంలో, ఇది ఆల్‌టైం కనిష్టస్థాయి 10.65శాతంకు చేరుకుంది.
- కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం అతితక్కువగా ఉన్న దేశాల్లో మనం కిందనుండి రెండో స్థానంలో ఉన్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి మన పాలకులు 'అచ్ఛేదిన్‌' వచ్చాయా? పోయాయా? అన్నది తెలుసుకోవచ్చు.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

భగ్గుమంటున్న పెట్రో ధరలు
మోడీ వర్సెస్‌ రాహుల్‌
ఆధార్‌ లీక్‌
క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌
మొండి బాకీల్లో భారత్‌ టాప్‌!
ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యమా?
రైతుల లాంగ్‌ మార్చ్‌కు అడ్డు
రాఫెల్‌ డీల్‌పై తప్పుడు సమాచారం
కొత్త డైరెక్టర్‌ వచ్చారుగా..
చౌకీదార్‌ హయాంలో విద్యారంగం నిర్లక్ష్యం
పాకిస్థానీలూ.. వెళ్లిపోండి..
'మందసోర్‌'పై కాంగ్రెస్‌ యూటర్న్‌
ఐఏఎఫ్‌ జెట్‌ విమానాలు ఢీ
బీజేపీ పాలనలో దళితులపై పెరుగుతున్న దాడులు
27న బొగ్గు పింఛనర్ల అర్ధనగ ప్రదర్శన
జగన్‌తో నాగార్జున భేటీ
జవాన్‌ కుటుంబానికి రూ.25 లక్షలు సాయం
ఆయుధంతో కనిపిస్తే కాల్చిపడేస్తాం
ఆదిత్యనాథ్‌పై కేసుపెట్టిన పోలీసు అధికారి సస్పెండ్‌
కోల్‌కతా పోలీస్‌బాస్‌ బదిలీ
దుర్వినియోగాన్ని ఆపండిొ ఢిల్లీ జర్నలిస్టు యూనియన్‌
'అధికారిక బంగళాలు ఖాళీ చేయాల్సిందే '
కృత్రిమ నిఘా!
కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌
ఉదాసీనత వల్లే ఉగ్రదాడులు..!
రూ.2వేలతో ఆదుకుంటారా?
సూట్‌.. బూట్‌.. లూట్‌ సర్కారు
జంతువధ నిషేధ వ్యాజ్యం తిరస్కరించిన సుప్రీం
'సహార'ను సందర్శించిన 'ఘనా' బృందం
భూపతిరెడ్డి కేసులో సర్కారుకు హైకోర్టు నోటీసులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.