Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర

Fri 12 Oct 02:56:23.871438 2018

- తెనాలిలో మహిళలపై లాఠీఛార్జ్‌
- 'పశ్చిమ'లో ఆరుగురికి గాయాలు
- పలుచోట్ల మున్సిపల్‌ కార్మికుల అరెస్టు
విజయవాడ: 279 జిఒను రద్దు చేయాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేస్తోన్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతిఘటిస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మహిళలపై పోలీసుల పిడిగుద్దులను తట్టుకోలేని ఓ కార్మికురాలు అస్వస్థతకు గురైంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఆరుగురికి గాయాలయ్యాయి. అయినా వెనకడుగు వేయని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు రాత్రింబవళ్లు గస్తీ తిరుగుతున్నారు. 8వ రోజైన గురువారం పలుజిల్లాల్లో వంటావార్పులు, ధర్నాలు, ర్యాలీలు రాస్తారోకోలు, నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం చంద్రబాబునాయుడు కాలనీలో పోటీ కార్మికులను అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న కమిషనర్‌ కార్మికులను మందలించడంతో పక్కనే ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు మహిళలను జీపు ఎక్కిస్తుండంతో వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో జయలక్ష్మి అనే కార్మికురాలిని మహిళా కానిస్టేబుల్స్‌ జుట్టుపట్టుకుని జీపులోకి ఈడ్చి వేయటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది. మరో ఇద్దరు కార్మికులు పద్మ, శివలక్ష్మి పైనా మహిళా కానిస్టేబుల్స్‌ పిడిగుద్దులు కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన జయలక్ష్మిని తోటి కార్మికులు స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉండగా మరో 16 మందిని అరెస్ట్‌ చేశారు. రేపల్లెలోనూ పోలీసు సిబ్బంది సైతం భారీగా మోహరించారు. అయినా కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తెనపల్లిలో పోటీ కార్మికులను కాంట్రాక్ట్‌ కార్మికులు అడ్డుకున్నారు. చెత్త ట్రాక్టర్‌ను వెళ్లనివ్వకుండా రోడ్డుపై బైఠాయించడంతో అక్కడున్న 30 మందిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాడేపల్లిలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడారు. ఇతర ప్రాంతాల్లోనూ విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగాయి. కృష్ణా జిల్లా గుడివాడలో మున్సిపల్‌ కార్మికులు బిక్షాటన చేశారు. తిరువూరులో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. తెనాలిలో మున్సిపల్‌ కార్మికుల లాఠీఛార్జీలకు నిరసనగా నందిగామ గాంధీ సెంటరులోనూ, జగ్గయ్యపేటలో ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట ధర్నాలు నిర్వహించారు. మచిలీపట్నంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా వైసిపి కౌన్సిలర్లు కూర్చున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు మున్సిపల్‌ కార్మికులపై లాఠీ ఛార్జికి నిరసనగా విజయవాడ సిటీలో మూడు సర్కిళ్ల పరిధిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. పైడితల్లమ్మ పండగ నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు కోసం సమ్మె విరమించాలని కోరుతూ కార్మిక సంఘం నాయకులతో అధికారులు బుధవారం చర్చలు జరిపారు. కార్మికులతో చర్చించాక నిర్ణయం తెలియ జేస్తామని అధికారులకు నాయకులు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్టు కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కాంట్రాక్టు కార్మికులను అదుపులోకి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా డిఎస్‌ చెరువు వద్ద వాహనం వెనుక ఉన్న డోరు ఊడిపోవడంతో ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు జారి పడిపోయి గాయాలపాలయ్యారు. వారిని అదే వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కాంట్రాక్టు కార్మికులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్దఎత్తున ఆందోళన చేశారు.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

భగ్గుమన్న భారతం
వైఫల్యం ఎక్కడ?
ఎన్‌డీఏ కొనసాగితే దేశ భద్రతకు ముప్పు
ఏపీలో డీఎస్‌సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల
బెదిరింపులకు లొంగిపోయారు
శాంతి భద్రతలో పోలీసు జాగిలాల పాత్ర కీలకం
జిగేశ్‌ని రావొద్దన్నారు.. రాజీనామా చేశాం
నేర్పుతున్న పాఠం ఏమిటి?
జనసేన కార్యాలయం వద్ద సందడి
ఓపెన్‌కాస్ట్‌లలో 500మీ లోపు పేలుళ్ళు నిలిపివేయండి
వందేభారత్‌ను ప్రారంభించిన మోడీ
పాన్‌ ఆధార్‌ లింకేజీ...
కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన
'డిగ్రీ ఫీజులు పెంచితే ఉద్యమం'
మసకబారుతున్న జలియన్‌వాలాబాగ్‌
పుల్వామా ఉగ్రదాడి ప్రభావం ' మోడీ ' బ్రాండ్‌కు అనుకూలమా..? ప్రతికూలమా..?
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విచారణ మార్చి 5కి వాయిదా
అయోధ్య భూసేకరణను సవాల్‌ చేస్తూ పిటిషన్‌
కృష్ణారావుకి జర్నలిస్టుల సన్మానం
అది ప్రజల విజయం
అటవీ భూముల హక్కులు కోల్పోయిన ఆదివాసీలపై నివేదిక ఇవ్వండి
మూడో రోజుకు పుదుచ్చేరి సీఎం ధర్నా
సీఈసీని ఎలా నియమిస్తారో..అలాగే
తొలి మహిళ ఫ్లైట్‌ ఇంజినీర్‌గా హీనా జైస్వాల్‌
ప్రతిపక్షాల ర్యాలీతో ఖంగుతిన్న బీజేపీ
చిన్నారిపై లైంగికదాడి
నరమేధం
నోట్లరద్దుతో మరణాలా..!
అంబానీ కేసులో జడ్జీ తీర్పునే మార్చారు
ప్రజాధనం ప్రయివేటు ఆస్పత్రుల పరం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.