Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బందరు లడ్డుతో సహా మరో 326 వస్తువులకు..
హైదరాబాద్:
హైదరాబాద్ హలీం బందరు లడ్డు.. సహా దేశంలో మొత్తం 326 వస్తువులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ విషయాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండిస్టీయల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ విభాగా నికి చెందిన సెల్ ఫర్ ఐపీఆర్ ప్రమోషన్స్ అండ్ మేనేజ్ మెంట్ (సీఐపీఏఎం)సంస్థ ఒక ట్వీట్లో వెల్లడించింది. ఈ 326 వస్తువుల్లో 14 విదేశాలకు చెందినవి కూడా ఉన్నాయని వెల్లడించింది.కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉత్ప త్తి అయ్యే వ్యవసాయ, సహజమైన, ప్రత్యేకంగా తయారు చేసిన వస్తువులు, పదార్థాలకు జీఐ టాగ్‌ను కేటాయిస్తారు. ఈ జీఐ టాగ్ వచ్చినప్పటి నుంచి పదేండ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత దీనిని రెన్యూవల్ చేయించుకోవాలి. జీఐ టాగ్ వచ్చిన వస్తువులకు నకళ్లు తయారు చేయకుండా చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈభౌగోళిక గుర్తింపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2003 సెప్టెంబర్‌లో భారత్‌లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది.