Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఖగోళంలో జరిగే పరిణామాలు చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అందులో సూర్య, చంద్ర గ్రహాణాలకూ చోటుంటుంది. కొత్త ఏడాదిలో ఇలా ఆసక్తి కలిగించే ఐదు గ్రహణాలు ఏర్పడనున్నట్టు సమాచారం. అందులోనూ 2019 మొదట్లోనే.. జనవరి 5న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం జనవరి 5 అర్ధరాత్రి నుంచి తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు సాగనుంది. అయితే ఈ అద్భుతాన్ని భారతీయుల వీక్షించలేరు. ఐరోపా, మధ్య ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రజలకు మాత్రమే ఈ అరుదైన అవకాశం చిక్కనుంది. కాగా, 2019లో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో మూడు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. జనవరి 5న సూర్యగ్రహణం పడగా.. అదే నెలలో చంద్రగ్రహణం కూడా ఏర్పడనుండటం విశేషం. ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడుతుంటాయి. అలా వచ్చినప్పుడు సూర్యుడు, భూమి మధ్యకు చంద్రుడు రాగా సూర్యగ్రహణం.. సూర్య, చంద్రుల మధ్యకు భూమి చేరినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే.