Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శబరిమల ఆందోళనలకు మద్దతుగా ప్రమాణం
తిరువనంతపురం: రెండేండ్ల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ యువతి హదియా పెండ్లి విషయం అంద రికీ తెలిసిందే. ముస్లిం వ్యక్తితో కూతురు హదియా ప్రేమ వివాహాన్ని అపట్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె తండ్రి కెఎం అశోకన్ మంగళవారం బీజేపీలోకి చేరారు. బీజేపీ జనరల్ సెక్రెటరీ బి గోపాలకృష్ణన్ ఆయనకు ప్రాథమిక సభ్యత్వం అందించి పార్టీలోకి చేర్చుకున్నారు. అలాగే శబరిమలలో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతునిస్తూ ఆయన ప్రమాణం కూడా చేశారు. ముస్లిం మతంలోకి మారి తన ప్రియుడు షెఫిన్ జహాన్‌ను హదియా సరిగ్గా రెండేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారి పెండ్లిని హదియా తండ్రి అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హదియా వివాహం చెల్లదని గతేడాది మేలో హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం ఆ తీర్పును ఈ ఏడాది మేలో కొట్టేసింది. ఆ సమయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయంలో హదియా తండ్రి కెఎం అశోకన్‌ను బీజేపీ వెనుకుండి నడిపించిన విషయం తెలిసిందే.