Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు :ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఆస్తులు రూ.28,69,53,991గా నామినేషన్ సందర్భంగా అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు రూ.650.73 కోట్లు ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు చేతిలో నగదు రూ.18,400, బ్యాంకు బ్యాలెన్స్ రూ.44,96,167 ఉందని తెలిపారు. మొత్తంగా రూ.47,38,067 చరాస్తులు, రూ.19,96,95,474 స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. తన భార్య భువనేశ్వరి వద్ద నగదు రూ.92,700, ఆమె బ్యాంకు బ్యాలెన్స్ రూ.15,18,668 ఉన్నాయని పేర్కొన్నారు. ఆమెకు ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.30వేలు ఉన్నాయి. చంద్రబాబు వద్ద అంబాసిడర్ కారు ఉంది. దీని విలువ రూ.2,22,500గా పేర్కొన్నారు. తన భార్య పేరు మీద హెరిటేజ్ ఫుడ్స్‌లో రూ.545.76 కోట్లు ఉన్నాయి. అన్‌లిస్టెడ్ మెగా బిడ్ రూ.22,49,900, నిర్వాణ హౌల్డింగ్స్ ప్రయివేటు లిమిటెడ్‌లో రూ.3,28,80,000 ఉన్నాయి. ఆమె దగ్గర 3,519 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ రూ.1.12 కోట్లు అని తెలిపారు. రూ.17 లక్షల విలువైన 42.41 కేజీల వెండి ఉందని వెల్లడించారు.