Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు ఉల్లంఘించినందుకు కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు
బెంగళూరు : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ 'ఓలా'కు భారీ షాక్ తగిలింది. నిబంధనలను అతిక్రమిం చినందుకు గానూ ఆ సంస్థ లైసెన్సు లు ఆరునెలల పాటు రద్దు చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఓలా బైక్ ట్యాక్సీలు నడుపుతుందని రాష్ట్ర రవాణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, ఆరు నెలల పాటు కర్నాటకలో ఓలా సర్వీసులు నిలిచిపోనున్నాయి. దీనికి సంబంధించి ఈనెల 18న ఆ సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు రవాణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అంశంపై ఓలాను వివరణ కోరామని, కానీ ఆ సంస్థ ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదని వారు తెలిపారు.