Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : అసోంలోని హైలకండిలో అధికారులు నిరవధిక కర్ఫ్యూను పొడ గించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూను పొడగించినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అంతకముందు ఈ కర్ఫ్యూను సోమవారం ఉదయం ఏడుగంటల వరకు విధించారు. జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు (మొత్తం మూడు గంటలు) కర్ఫ్యూ నుంచి మినహాయిం పునివ్వాలని జిల్లా మేజిస్ట్రేటు జెల్లి కీర్తి ఆదేశించారు. గత 24 గంటల్లో జిల్లావ్యా ప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.