Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 116 ఐరన్ మేకులు.. పొడవాటి వైరు
- ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
కోటా : రాజస్థాన్‌లో డాక్టర్లను షాక్‌కు గురిచేసే ఓ ఘటన చోటుచేసుకున్నది. ఒక వ్యక్తి కడుపులో కుప్పలుతెప్పలుగా ఉన్న 116 ఐరన్ మేకులతో పాటు ఒక పొడవాటి వైరును డాక్టర్లు గుర్తించారు. చివరకు ఆ వ్యక్తికి అరుదైన ఆపరేషన్‌ను నిర్వహించి వాటిని బయటకు తీశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన బుందీ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకున్నది. కొన్ని రోజుల నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న భోలాశంకర్.. మెడికల్ చెకప్ కోసం ఆదివారం ఆస్పత్రికి వచ్చాడు. అనంతరం ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అనిల్ సైనీ.. శంకర్‌కు ఎక్స్‌రే తీశారు. అయితే ఆయన కడుపులో ఏవో వస్తువులున్నట్టు గుర్తించారు. ఎందుకైనా మంచిదేనని ఆయనకు సిటి స్కాన్ చేయగా అందులోనూ అదే విషయం బయటపడిందని డాక్టర్ సైనీ వెల్లడించారు. అనంతరం ఆ వ్యక్తికి శస్త్రచికిత్సను నిర్వహించి గంటన్నర పాటు శ్రమించి ఆయన కడుపులో ఉన్న ఐరన్ మేకులను, పొడవాటి వైరును తొలిగించామని తెలిపారు. ఒక్కో మేకు 6.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నదని, ఒక వేళ అవి ఆయన పేగుల్లోకి వెళ్లి ఉంటే ప్రాణాలతో ఉండకపోయేవారని, అదృష్టావశాత్తు ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వైద్యుడు తెలిపారు. 2017లో బుందీ నివాసి బద్రీలాల్(56) శరీరం నుంచి 150 సూదులను, మేకులను వైద్యులు శస్త్ర చికిత్స చేసి బయటకు తీసిన విషయం తెలిసిందే.