Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్
చెన్నై : ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'హిందు' పదం స్థానిక పదం కాదని, దానికి విదేశీ మూలాలున్నాయని అన్నారు. అది విదేశీయులు మనకు అంటగట్టిన పదమని తెలిపారు. అళ్వార్లు, నయన్మార్లు, వైష్ణవులు, శైవులూ 'హిందు' అనే పదాన్ని ఎక్కడా వాడలేదని ఒక ట్వీట్లో ఆయన వివరించారు. ఇక్కడి ప్రజలను ఇండియన్స్ అని గుర్తించారని, వారిని హిందువులని పిలవడం తప్పు అని తెలిపారు. ఇండియాలోని ప్రజలను హిందువులుగా మొఘలులు గుర్తించారని, దాన్ని బ్రిటీషర్లు ఆమోదించి అలాగే పిలిచారని వివరించారు. ఎన్నో అస్తిత్వాలను కలిగి ఉన్న మనం విదేశీయులు ఇచ్చిన గుర్తింపును అంగీకరించడం తెలివితక్కువ తనమని పేర్కొన్నారు. భిన్న సంస్కృతులు, అస్తిత్వాలు కలిగి ఉన్న ప్రజలను ఒక మతానికి కుదించడమూ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఒక తమిళ పద్యాన్ని ఉటంకిస్తూ.. అందరు కలిసి ఉంటే ఎంతో ఫలప్రదంగా ఉంటుందని సూచించారు.