Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఐరోపా పార్లమెంట్ ఎన్నికలు
భారత్ తరువాత ప్రపంచంలో రెండో పెద్ద ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియ ఐరోపా పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమై ఆదివారం (26వ తేదీ) వరకూ కొనసాగుతుంది. ఈ ఏడాది జులై నుంచి ఐరోపా పార్లమెంట్లో ఆయా దేశాలకు వున్న స్థానాలు
ఈ 28 సభ్యదేశాలకు చెందిన దాదాపు 40 కోట్ల మంది ఓటర్లు ఐరోపా పార్లమెంట్లో 751 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. మే 26న ఆదివారం ఫలితాలను వెల్లడిస్తారు. జులై 2 నుంచి ఐదేండ్లు పాటు కొత్త సభ్యులు పదవిలో కొనసాగుతారు
2016లో బ్రిటన్ ప్రజలు తమ దేశాన్ని ఐరోపా కూటమి నుంచి నిష్క్రమించాలని రిఫరెండంలో నిర్దేశించారు. కానీ ప్రధాని థెరెస్సా మే మాత్రం నిష్క్రమణ ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదముద్ర పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీనితో ఐరోపా కూటమిలో బ్రిటన్ సభ్యత్వాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 వరకూ పొడిగించారు.
బ్రిటన్ ఓటర్లు తమ దేశం నుంచి 73 మంది సభ్యులను దేశంలోని 12 ఎలక్టోరల్ ప్రాంతాల నుంచి ఐరోపా పార్లమెంట్‌కు ఎన్నుకుంటారు.
ఐరోపా పార్లమెంట్ విధులు
ఐరోపా కూటమి బడ్జెట్, చట్టపరమైన అధికారాలను ఐరోపా కూటమి మండలి (ఈయూ ప్రభుత్వాలతో) పంచుకుంటుంది.
ఐరోపా కమిషన్ అధ్యక్ష ఎన్నికలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈయూ వ్యవస్థలను ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసే విధంగా నిర్దేశిస్తుంది.
ఐరోపా పార్లమెంట్ సభ్యుల వేతనం నెలకు రు.6.8 లక్షలు.
ఐరోపా పార్లమెంట్ బ్రస్సెల్స్, స్ట్రాస్‌బర్గ్ నగరాలలో ఉంది.
జర్మనీ 96
ఫ్రాన్స్ 74
ఇటలీ 73
బ్రిటన్ 73
స్పెయిన్ 54
పోలెండ్ 51
రుమేనియా 32
బెల్జియం 21
నెదర్లాండ్స్ 26
చెక్ రిపబ్లిక్ 21
గ్రీస్ 21
హంగరీ 21
పోర్చుగల్ 21
స్వీడన్ 20
ఆస్ట్రియా 18
బల్గేరియా 17
డెన్మార్క్ 13
ఫిన్లాండ్ 13
ఐర్లండ్ 11
క్రోయేషియా 11
లిథువేనియా 11
లాత్వియా 8
స్లొవేనియా 8
ఎస్తోనియా 6
సైప్రస్ 6
లక్సెంబర్గ్ 6
మాల్టా 6