Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగ్-21 బైసన్ సూపర్‌సానిక్ జెట్‌తో
తొలి మహిళా రికార్డు
న్యూఢిల్లీ : ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన అత్యంత అరుదైన ఘనత సాధించారు. యుద్ధ విమానాన్ని ఉపయోగించి, పగటిపూట యు ద్ధం చేయడానికి ఆమె అర్హత సాధించారు. మిగ్-21 బైసన్ సూపర్‌సానిక్ జెట్‌తో ఆమె యుద్ధ రంగంలో తన సత్తా చాటవచ్చు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టిం చారు.భావన బీహార్‌లోని దర్భంగకు చెందినవారు. మిగ్-21 పగటిపూట కార్యకలాపాల పాఠ్య ప్రణాళికను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. బికనీర్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌లో ఆమె శిక్షణ పొందారు.2017 నవంబరులో భావన ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరారు. 2018 మార్చిలో మిగ్-21 బైసన్‌ను మొదటిసారి స్వయంగా నడిపారని భారత వాయు సేన అధికార ప్రతినిథి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ తెలిపారు.