Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: 'మైనరుపై చేస్తేనే అది లైంగికదాడి. 30 - 35 ఏండ్ల మహిళపై లైంగికదాడి ఘటనను భిన్నంగా చూడాలి. వారు చేస్తున్న లైంగికదాడి ఆరోపణలను పరిగణనలోకి తీసుకోరాదు' అని బీజేపీ యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. సామాజిక మాధ్యమంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. కొన్నిసార్లు 30-35 ఏండ్ల వివాహితులు కూడా లైంగికదాడి ఆరోపణలతో ముందుకు వస్తున్నారని, అయితే ఈ ఘటనల స్వభావం వేరుగా ఉంటుందని, ఇలాంటి కేసులను భిన్నంగా చూడాలన్నారు. వారుచేస్తున్న లైంగికదాడి ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. అంతేకాదు, కొన్నేండ్లు సదరు వ్యక్తితో సంబంధం కలిగివుంటారనీ, ఆ తర్వాత లైంగికదాడి ఆరోపణలు చేస్తారని వ్యాఖ్యానించారు. యూపీలోని అలీగఢ్‌లో రెండున్నరేండ్ల పాప దారుణ హత్యపై స్పందించిన ఉపేంద్ర తివారీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై బాధ్యతారహితంగా వ్యాఖ్యానించిన ఆయన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆయన వ్యాఖ్యలను మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు ఖండించారు.