Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 60 వెబ్సైట్లు, రేడియో ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచ కప్ ఆడియో కామెంటరీ ప్రసారాలను నిలిపివేయాలనీ ఢిల్లీ హైకోర్టు 60 వెబ్సైట్లు, కొన్ని రెడియో ఛానళ్ల పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ కప్ ప్రసారాలకు సంబంధించి మే 30 నుండి జూలై 14 వరకు మొత్తం కార్యక్రమాల ఆడియో ప్రసారాలపై తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయనీ ఛానెల్ 2 గ్రూప్ కార్పొరేషన్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న వెబ్సైట్లు, రేడియో ఛానళ్ల పై కోర్టు నిషేధం విధించింది. జస్టిస్ ఆర్.మిధా నాయకత్వంలోని బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 4న జరిగే తదుపరి విచారణ కంటే ముందే ఆయా వెబ్సైట్లు, రేడియో ఛానెళ్లు కోర్టు పంపిన సమన్లకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.