Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్లకు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని తెలంగాణ సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. సినిమా ప్రొజెక్టర్ ఆపరేటర్ల సమస్యలపై ఈనెల 26న లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్, గౌరవాధ్యక్షులు ఎన్ మారన్న, అధ్యక్ష, కార్యదర్శులు పి పుల్లారావు, ఎ అరుణ్‌కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రొజెక్టర్ ఆపరేటర్లకు ఈఎస్ఐ, ఈఫిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. వీక్లీ ఆఫ్‌లు, సాధారణ సెలవులు అమలు చేయాలని, బోనస్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. చట్టం ప్రకారం కనీస వేతనాలు రూ 20వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్‌రెడ్డి, సుధాకర్, వీరనారాయణ, సుభాష్, భూపాల్, శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.