Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళపై విచక్షణారహితంగా దాడి
- కాంగ్రెస్ నేత సోదరుడి దౌర్జన్యం
చంఢగీఢ్: అప్పుతీర్చలేదనే కోపంతో ఓ కాంగ్రెస్ నేత సోదరుడు, అతని అనుచరులు మహిళపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న మహిళను వీధిలోకి లాక్కొచ్చి కిందపడేసి, కాలుతో తన్నుకుంటూ, బెల్టుతో కొట్టారు. అడ్డుకోబోయిన తన తల్లిపై సైతం దాడికి దిగారు. ఈ ఘటన పంజాబ్లోని ముక్తసర్లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ముక్తసర్కు చెందిన ఓ మహిళ..కాంగ్రెస్ స్థానిక నేత, మున్సిపల్ కౌన్సిలర్ రాకేశ్ చౌదరి సోదరుడు సురేశ్ వద్ద రూ.23000 అప్పుగా తీసుకుంది. ఇచ్చిన గడువు ముగిసినా అప్పు తీర్చలేదనే కోపంతో సురేశ్.. తన అనుచరులతో కలిసి మహిళ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న ఆ మహిళను వీధిలోకి లాక్కొచ్చి తీవ్రంగా దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిందపడిన ఆ మహిళపై సురేశ్ కూర్చొని పిడిగుద్డులతో దాడిచేస్తుండ గా..తన అనుచరులు బెల్టుతో కొడుతూ.. కాలితో తన్నుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. బాధిత మహిళ కొడుకు ఏడుస్తున్నా వదల్లేదు. అడ్డుకోబోయిన ఆమె తల్లిపైనా దాడిచేశారు. తమ కసి తీరా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీ సులు సురేశ్ సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా కౌన్సిలర్ రాకేశ్ చౌదరి సహా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.