Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోధ్‌పూర్ కోర్టు తీర్పు
జైపూర్: నకిలీ అఫిడవిట్ సమర్పించారని దాఖలైన కేసులో బాలివుడ్ సినీనటుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు సోమవారం క్లీన్‌చీట్ ఇచ్చింది. 1998లో సల్మాన్ ఓ సినిమా షూటింగ్‌కు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్లారు. అక్కడ కష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. కోర్టు విచారణకు ఆదేశించగా అందులో సల్మాన్ దోషిగా తేలారు. దాంతో కోర్టు ఆయనకు ఐదేండ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు జైల్లో గడిపిన అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా, ఇదే కేసులో సల్మాన్ తన తుపాకీ లైసెన్స్ పేపర్లు పోయాయని కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆయనపై మరో కేసు నమోదైంది.