Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితురాలి ఫిర్యాదుతో జార్ఖండ్‌లో వెలుగులోకి
రాంచీ : జార్ఖండ్‌లో బీజేపీ యువజన విభాగం బీజేవైఎం నేత.. ఆ పార్టీ మహిళా కార్యకర్తపై లైంగికదాడికి ఒడిగట్టాడు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించిన వీడియో పంపుతూ తరుచూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మనోవేధనకు గురైన సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సెరైకెలా-ఖర్సావన్ జిల్లా బీజేవైఎం మాజీ అధ్యక్షుడు అమిత్ సిన్హా.. తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, ఆ ఘటనకు సంబంధించిన వీడియో పంపుతూ వేధిస్తున్నాడని బీజేపీ మహిళా కార్యకర్త ఆదిత్యాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తరుచూ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వేధింపులు ఆత్మహత్య ఆలోచనలనూ పురికొల్పాయని వివరించారు. బాధితురాలు తాను ఎదుర్కొన్న క్షోభను మహిళా పోలీసు అధికారికి చెప్పుకున్నదని, అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఆదిత్యాపూర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జీ విజరు కుమార్‌సింగ్ తెలిపారు. దీనిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదరు ప్రతాప్ సింగ్ స్పందిస్తూ.. నిందితుడు అమిత్ సిన్హా బీజేవైఎం జిల్లా మాజీ అధ్యక్షుడని తెలిపారు. కానీ, అతన్ని పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరించినట్టు వివరించారు.