Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ను ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు వరించింది. భారత ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో ఉత్తమ కలెక్టర్ అవార్డుకి శరత్ ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, ఉత్తమ పాలన, వినూత్న ఆలోచనలపై ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ సర్వే నిర్వహించింది. ఢిల్లీలో బుధవారం ఓబరారు హౌటల్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ అవార్డు అందుకోవడంపై శరత్ సంతోషం వ్యక్తం చేశారు.