Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021లో గగన్‌యాన్: శివన్
న్యూఢిల్లీ : చంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఇస్రో చైర్మెన్ శివన్‌పై పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు విమర్శలు చేస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఇస్రోలోని 'అంతరిక్ష అనువర్తన కేంద్రం' మాజీ చీఫ్ తపన్ మిశ్రా శివన్ నాయకత్వాన్ని విమర్శిస్తూ ఫేస్బుక్లో ట్వీట్ చేశారు. ఇస్రోలో టాప్డౌన్ వర్కింగ్ కల్చర్, చంద్రయాన్-2ను విజయపథంలో నడిపించడంలో శివన్ విఫలమయ్యారని పేర్కొన్నారు. అలాగే ఆయన అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు.
మిశ్రా పోస్టు చేసిన కొద్దిసేపటికే శివన్ స్పందిస్తూ.. చంద్రయాన్-2 98 శాతం విజయవంతమైనట్టు ట్వీట్ చేశారు. సాంకేతిక ప్రదర్శనల విజయాల రేటు వందశాతం ఉందని తెలిపారు. చంద్రయాన్ ఆర్బిటార్ జీవిత కాలం ఏడాదికాలం డిజైన్ చేశామనీ, ఇస్రో సునిశిత ప్రణాళిక కారణంగా దాన్ని జీవిత కాలాన్ని ఏడున్నరేండ్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 'గగన్‌యాన్ మిషన్' పై దృష్టి సారించామనీ, 2021లో అంతరిక్షంలోకి మనిషిని పంపే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.