Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 జెట్ ఫైటర్ల కొనుగోలుకు యత్నాలు
నూఢిల్లీ: భారత్ మరోసారి రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఫ్రాన్స్ నుంచి మరో 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు భారత రక్షణ పరిశోధన విభాగం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశముందని వెల్లడించింది. ఈ ఒప్పందం కుదిరితే భారత్ వద్ద ఉండే మొత్తం రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 72కు చేరుతుంది. క్రితం ఒప్పందానికి సంబంధించిన విమానాలను అప్పగించే ప్రక్రియ వచ్చే నెల 8న జరగనున్న విషయం తెలిసిందే. వీటిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా అందజేయనున్నారు.