Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సీఎం సోదరి, కూతురు సహా మహిళా కార్యకర్తల అరెస్ట్
శ్రీనగర్: కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఆర్టికల్ 370రద్దు నిర్ణయంపై జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జ మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయా, కూతురు సాఫియా సహా మరికొంతమంది మహిళా కార్యకర్తలు శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద బుధవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ సర్కార్ తీసుకున్న ఆర్టికల్ 370, 35ఏ రద్దు నిర్ణ యాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. నిర్బంధంలో ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లో అంతా శాంతియుతం గానే ఉందంటూ తప్పుడు ప్రసారాలు చేస్తున్న జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టాయి. మీడియాతో మాట్లాడ నీయకుండా అడ్డుకున్నాయి.