Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు మూడు గంటల తర్వాత పరిష్కారం
పనాజీ : గోవా ప్రభుత్వానికి చెందిన రెండు వెబ్సైట్లు కొన్ని గంటలపాటు హ్యాక్‌కు గురయ్యాయి. ఆ రెండు సైట్ పేజీలలో అడుగున్న ఉన్న 'ఆధార్' లోగోను క్లిక్ చేస్తే.. పోర్న్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అయింది. దాదాపు మూడు గంటలపాటు ఇలాగే జరిగింది. ఈ విషయాన్ని ఆధార్ డేటాపై చాలెంజ్ చేసి వెలుగులోకి వచ్చిన హ్యాకర్ ఇలియట్ అండర్సన్.. తొలుత పోస్ట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ గోవా, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ గోవా వెబ్సైట్ల నుంచి అశ్లీల వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అయ్యాయి. దాదాపు మూడు గంటల తర్వాత ఈ సమస్యను నిపుణులు పరిష్కరించారు.
గతేడాది జులైలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మెన్ ఆర్ఎస్ శర్మ ఆధార్ నెంబర్ బయటకు చెప్పి.. ఎలా దుర్వినియోగం చేస్తారనీ ఓ సవాల్ విసరగా.. అండర్సన్ ఆ గుర్తింపు నంబర్‌తో శర్మ గారి భార్య, కూతుర్ల సమాచారాన్ని, ఆయన పుట్టిన తేదీ, మరో మొబైల్ నెంబర్, అతని చిరునామా, బ్యాంక్ ఖాతా నెంబర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆధార్ సమాచారం భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి. కాగా, 2018లోనే అశ్లీల వెబ్సైట్లను రద్దు చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మోడీ సర్కారు ఆదేశించిన విషయం గమనార్హం.