Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎన్ తాజా అంచనా రిపోర్టు
- ఇప్పటికే గణాంకాల్ని సవరించిన ఆర్బీఐ, ఎస్బీఐ సహా ఏడు సంస్థలు
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పతనమయ్యే సూచనలు కనపడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి సైతం భారత జీడీపీ గణాంకాల్ని తగ్గించింది. 2019-20లో జీడీపీ వృద్ధి 5.7శాతం నమోదుకావొచ్చని తాజాగా అంచనావేసింది. ఇంతకుముందు ఆర్బీఐ, ఎస్ బీఐ, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, మూడీస్, నోమురా (రేటింగ్ సంస్థలు)...భారత జీడీపీ వృద్ధి తగ్గుతుం దని అంచనావేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఏడా దికి సంబంధించి వివిధ దేశాల వృద్ధి అంచనాలను తెలియజే స్తూ ఐరాస నివేదిక (ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు- 2020)ను విడుదలచేసింది. అమెరికాతో ఓ వైపు ట్రేడ్వార్ను ఎదుర్కొంటూనే చైనా 2019లో 6.1శాతం జీడీపీ వృద్ధి సాధించవచ్చునని ఐరాస అంచనావేసింది.
ధరల పోటు...నిరుద్యోగం
కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పు, ఉప్పు...వీటి ధరలు సామాన్యుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కూరగాయల ధరలు 60.5శాతం, పప్పు దినుసుల ధరలు 15.44శాతం పెరగటంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం...భారత ఆర్థిక స్థితిని సరిగ్గా తెలుపుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డిసెంబరు 2019లో రిటైల్ ద్రవ్యోల్బణం (టోకు ధరల ఆధారిత) 7.35శాతానికి పెరిగింది. జులై 2014 తర్వాత అత్యధికస్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. ఓ వైపు ధరలపోటు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే, మరోవైపు దేశంలో యువత నిరుద్యోగ సమస్యతో విలవిల్లాడుతున్నది. సీఎంఐఈ తాజా గణాంకాల ప్రకారం, 13 జనవరి 2020నాటికి నిరుద్యోగం 7.6శాతానికి (45ఏండ్ల గరిష్టం) ఎగబాకింది.
ఆ మూడు దెబ్బకొట్టాయి..
వాహన తయారీ : భారత్ తీవ్రమైన మాంద్యం దిశగా వెళ్తుందన్న సంకేతం...మొదట వాహన రంగం నుంచి వెలువడింది. దేశ జీడీపీలో 7శాతం వాటా, తయారీరంగంలో 49శాతం వాటా కలిగివున్న వాహనరంగం అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నది. గత రెండు సంవత్సరాలుగా వాహన అమ్మకాలు అనూహ్యంగా క్షీణించాయి. అమ్మకాలు 19ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి.
కార్పొరేట్లకు పన్ను ప్రయోజనాలు : గతేడాది సెప్టెంబరులో బడా కార్పొరేట్లకు, అత్యంత ధనికులకు మోడీ సర్కార్ పెద్ద మొత్తంలో పన్ను ప్రయోజనాలు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం పారిశ్రామిక ఉత్పత్తి ని పెంచలేకపోయింది. పెరగకపోగా...పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వేగంగా పడిపోతున్నది. ఐఐపీ సెప్టెంబరులో 4.3శాతం, అక్టోబరులో 3.8శాతం నమోదైంది. గణాంకాలు 8ఏండ్ల కనిష్టానికి చేరుకున్నాయి.
ఎన్బీఎఫ్సీ సంక్షోభం : 'ఎన్బీఎఫ్సీ' కంపెనీల నగదు సంక్షోభం ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసిందనీ, వృద్ధిరేటు పడిపోవటానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటనీ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.