Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరప్షన్ ఇండెక్స్‌లో 80వ స్థానం
- ఎన్నికల్లో పెరిగిన ధన ప్రవాహం
- కార్పొరేట్ల కోసం పాలకుల నిర్ణయాలు : 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్'
దావోస్ : భారత్, ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందని 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్' తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. ఎన్నికల్లో ధన ప్రవాహం ఊహించనంత స్థాయిలో ఉందనీ, ప్రభుత్వాలు బాగా డబ్బులున్నోళ్ల మాటనే వింటున్నాయనీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్-2019 నివేదికను దావోస్‌లో 'వరల్డ్ ఎకనమిక్ ఫోరం' సదస్సులో విడుదల చేశారు. ఈ నివేదికలో పేర్కొన్న మిగతా విషయాలు ఇలా ఉన్నాయి.. గత ఏడాదితో పోల్చితే (2018లో 78వ ర్యాంక్) అవినీతిని అరికట్టడంలో భారత్ పరిస్థితి దిగజారింది. ప్రభుత్వ శాఖల్లో, అధికార రాజకీయాల్లో అవినీతి అనూహ్యంగా పెరిగింది. 2019లో 41 స్కోర్‌తో 80వ ర్యాంక్‌లో నిలబడింది. డెన్మార్క్, న్యూజీలాండ్ మొదటి స్థానాల్లో నిలబడగా, ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. క్రితం ఏడాదితో పోల్చితే 2019లో 22 దేశాలు మాత్రమే తమ ర్యాంక్‌ను మెరుగు పర్చుకున్నాయి. మిగతా దేశాల స్కోర్ పడిపోయింది.
ధనవంతులకు దగ్గరగా పాలన ఆస్ట్రేలియా, అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఎన్నికల అనగానే వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. బడా కార్పొరేట్లు, ధనికులు తెరవెనుకుండి రాజకీయా ల్ని నడిపిస్తున్నారు. ఎన్నికల్లో ఇష్టమొచ్చి నట్టు ధనాన్ని ఖర్చుచేసి అధికారాన్ని కైవసం చేసుకుంటు న్నారు. ప్రతిఫలంగా కార్పొరేట్లకు అనుకూలించే విధాన నిర్ణయాలు పాలకులు తీసుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏదైనా పని నిమిత్తం వెళ్తే...అక్కడ ఉన్నోడికే పని అవుతుంది తప్ప, సామా న్యుడి మాట వినే నాథుడే లేడు. ఇదీ భారత్‌లోని పరిస్థితి...అంటూ నివేదిక ప్రత్యేకంగా తెలిపింది.
- మనదేశంలోని రాజకీయ విరాళాల్లో పారదర్శకత లోపించింది. కార్పొరేట్లు, ధనికులు ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేస్తున్నారు.
- పెద్ద ఎత్తున రాజకీయ విరాళాలు సమకూర్చాక, కార్పొరేట్ లాబీయింగ్ శక్తిమంతంగా మారుతోంది. అవినీతి నియంత్రణకు ఇదొక పెద్ద అడ్డంకిగా మారింది.
- ప్రపంచంలోని మూడొంతుల దేశాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందినవి సైతం అవినీతిని నియంత్రించలేక పోతున్నాయి.
అవినీతి డబ్బు పెద్ద ఎత్తున రాజకీయ విరాళాలుగా మారుతున్నది. ఈరంగంలో పారదర్శకత తీసుకురావటంపై ప్రభుత్వాలు చాలా సీరియస్‌గా దృష్టిసారించాలి. లేదంటే ప్రభుత్వాలపై అవినీతి ప్రభావం తొలగించలేవు.
- డీలియా ఫెర్రైరా రూబియో, చైర్మెన్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్