Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసన సభలో సీపీఐ(ఎం) మహిళా ఎమ్మెల్యేపై తృణమూల్ సభ్యురాలి వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్‌కతా : శాసనసభ సాక్షిగా పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన మహిళా ఎమ్మెల్యే 'నువ్వు లైంగికదాడికి గురవుతావు' అంటూ ప్రతిపక్ష సీపీఐ(ఎం)కు చెందిన మహిళా ఎమ్మెల్యేపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా టీఎంసీ ఎమ్మెల్యే నర్గిస్ భేగం శనివారం ప్రసంగిóంచారు. అదే సమయంలో టీఎంసీ ప్రభుత్వం ఒక మోసపూరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందంటూ సీపీఐ(ఎం)కు చెందిన ఎమ్మెల్యే జహనారా ఖాన్ తన స్థానంలోనే లేచి వ్యతిరేకించారు. దీంతో నర్గిస్ భేగం అమెపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. హుందాగా వ్యవహరించాలని ఒకవైపు స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ చెబుతుండగా, ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సభలో గందరగోళం వాతావరణం నెలకొంది. నర్గిస్ భేగం చేత సభకు, సభ్యురాలికి క్షమాపణలు చెప్పడంతోపాటు ఆమెపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. వివాదంపై కొంత చర్చ అనంతరం నర్గిస్ చేసిన వ్యాఖ్యలను ప్రొసీడింగ్స్ నుంచి తొలగిస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ సుకుమార్ గోస్దా ప్రకటించారు.