Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేనెప్పుడు ప్రయోగాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. అది సినిమా అయినా టీవీ షో అయినా సరే సరికొత్తగా ఉండాలని ప్రయత్నిస్తా. కొత్తదనం లేకపోతే ప్రేక్షకులను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలరించలేం' అని అంటున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షరుకుమార్.
అక్షరు ప్రస్తుతం 'ది ఎండ్' అనే డిజిటల్ షోలో నటిస్తున్న విషయం విదితమే. దీని ప్రారంభం రోజు సూట్ ధరించి ఒంటినిండా మంటలతో వేదికపైకి వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ షోని ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో దీని చిత్రీకరణ నిలిచి పోయింది. దీంతో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దీన్ని మొదలు పెట్టే యోచనలో షో నిర్వాహకులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ షో గురించి సామాజిక మాధ్యమం ద్వారా అక్షరు మాట్లాడుతూ, 'కొత్త ప్రయోగాలను నేను బాగా నమ్ముతాను. నా కెరీర్లో ఇప్పటివరకు అలాంటివే చేస్తూ వచ్చాను. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాను. అలాగే ఈ షో కూడా ఎంతో కొత్తగా ఉంటుంది. ఈ యాక్షన్ ఎడ్వెంచర్ షోలో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా? అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నేను డిజిటల్ వరల్డ్‌లోకి వస్తున్నానని తెలిసి, నాన్నా.. యూత్‌కి బాగా నచ్చేలా నీ షో ఉండాలని మా అబ్బాయి ఆరవ్ ఓ సలహా ఇచ్చాడు. వాడి సలహా మేరకు ఈ షోలోని అంశాలన్ని యూత్‌ని అలరించేలా జాగ్రత్తలు తీసుకున్నాం' అని చెప్పారు.