Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ మినీ ఇండిస్టీగా పిలవబడే అక్షరుకుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'రక్షాబంధన్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రాఖీ పండుగని పురస్కరించుకుని కథానాయకుడు అక్షరు సోమవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. తోబుట్టువులతో అక్షరు నవ్వుతూ కనిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్ అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఉండటం విశేషం. నవంబర్ 5, 2021న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఫస్ట్‌లుక్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం గురించి అక్షరు మాట్లాడుతూ, 'ఈ సినిమా కథ మీ గుండెల్ని తాకుతుంది. నా కెరీర్లోనే త్వరగా గ్రీన్‌సిగల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడంతోపాటు ఏడిపిస్తుంది కూడా. ఈ చిత్రంలో నా సోదర, సోదరీమణులుగా నటించిన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని నా సోదరి అల్కాకి అంకితం ఇస్తున్నాను' అని తెలిపారు. అక్షరు ఈ సినిమాతోపాటు 'ఆట్రంగి రే', 'సూర్యవంశీ', 'పృధ్వీరాజ్', 'లక్ష్మీబాంబ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిల్లో 'లక్ష్మీబాంబ్' చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీన్ని త్వరలోనే డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన 'కాంచన' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో అక్షరుకుమార్, కైరా అద్వానీ జంటగా నటించారు. ఈ చిత్రానికి కూడా రాఘవ లారెన్సే దర్శకత్వం వహించారు. ఆద్యంతం భయపెడుతూనే సమాజానికి ఉపయోగపడే ఓ మంచి సందేశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.