Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా వెండితెరకు పరిచయమై దిగ్విజయంగా 45 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ '45 ఏళ్ళ రజనీయిజం' పేరుతో ఓ పోస్టర్ని సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ రజనీకాంత్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా భిన్న పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో 45 ఏళ్ళుగా రజనీకాంత్ పేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 1975లో కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన 'అపూర్వ రాగన్గళ్' తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రజనీ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఎన్నో అఖండ విజయాలు సాధించిన చిత్రాలు, ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. అన్నింటికిమించి తలైవా ప్రత్యేక మేనరిజమ్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయని వేరే చెప్పక్కర్లేదు.