Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టాటా సమ్మర్ సందడి 2020 విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో భాగంగా చిత్రం భళారే విచిత్రం షార్ట్ ఫిల్మ్, మ్యూజిక్ వీడియోస్ కేటగిరిలో ఉత్తమ లఘు చిత్రాలుగా 'కోవిడ్ సొల్యూషన్స్', 'మాతదేవోభవ', 'అలా మొదలైంది', 'వేక్ అప్ కాల్', 'బ్యాక్ టు రూట్స్', 'టెన్నిస సిటీ', 'చదువు' అలాగే ఉత్తమ మ్యూజిక్ వీడియోలుగా 'వానమ్మ', 'నేనేంటో', 'కదిలే కాలం' , 'ఓ మై గాడ్ డాడీ', 'కార్తిక్ జయంతి', 'వినరా వినరా', 'నా కలలే' విజేతలుగా అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ డా||ఆనంద్ మాట్లాడుతూ,'ఈ ఏడాది తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టాటా సమ్మర్ 2020కి మంచి స్పందన లభించింది. చిత్రం భళారే విచిత్రం విభాగం కోసం పోటీలో పాల్గొన్న లఘు చిత్రాలను, మ్యూజిక్ వీడియోల్లో ది బెస్ట్ అనేలా ఉన్నవాటిని ఎంపిక చేశాం. ఈ ఎంపిక ప్రక్రియలో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌లతో కలిసి నేను కూడా జ్యూరీలో వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. మంచి షార్ట్ ఫిల్మ్స్‌తోపాటు సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉన్న మ్యూజిక్ వీడియోల ఎంపికలో ప్రముఖులతో పాల్గొనే అరుదైన అవకాశాన్నిచ్చిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ప్రెసిడెంట్ భరత్ మదాడి, నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ. కె. వనమ, శ్రీనివాస్ గూడురు, మాధవి సోలేటి, నిక్షిప్త రెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని చెప్పారు.