Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'లస్ట్ స్టోరీస్' వంటి బోల్డ్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న అమలాపాల్ లేటెస్ట్గా మరో బోల్డ్‌గా ఉండే వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోయే ఈ వెబ్ సిరీస్‌లో 1970 కాలం నాటి నేపథ్యాన్ని చూపించబోతున్నారు. అలాగే అప్పటి పరిస్థితులను తెలిపే ఓ నవల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ఇందులో ప్రధాన పాత్రధారిగా నటించబోయే అమలాపాల్ చాలా బోల్డ్‌గా కనిపించనుందని వినిపిస్తోంది. అలాగే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లోనూ ఆమె బోల్డ్‌గా కనిపించబోతున్నారు. నలుగురు బాలీవుడ్ దర్శకులు రూపొందిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'ని నలుగురు ప్రముఖ దర్శకులు తెలుగులోనూ రీమేక్ చేస్తున్నారు. వీటితోపాటు హిందీలో మహేష్‌భట్ రూపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటించేందుకు అమలా గ్రీన్‌సిగల్ ఇచ్చారు.