Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ ఆలీఖాన్, కరీనాకపూర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సైఫ్ దంపతులు అధికారికంగా ప్రకటించారు. 'మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలియజేయడానికి సంతోష పడుతున్నాం. మీ ప్రేమను ఎప్పుడూ అందించే శ్రేయోభిలాషులకు, అభిమానులకు ధన్యవాదాలు' అని సైఫ్ దంపతులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సైఫ్, కరీనాకు కుమారుడు తైమూర్ ఆలీఖాన్ ఉన్న విషయం తెలిసిందే.