Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సంజూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తోన్న వారికి కృతజ్ఞతలు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మాకు మీ అందరి ప్రార్థనలు అవసరం. గతంలో మాదిరిగానే ఈసారి కూడా దీన్ని దాటుకుని రాగలమన్న నమ్మకం ఉంది. అనవసరమైన పుకార్ల కారణంగా ఆందోళనకు గురికావద్దు. మీ ప్రేమతో మాకు సహకరించమని సంజు అభిమానులను కోరుతున్నాను. పరీక్షించడానికి దేవుడు మరోసారి మమ్మల్ని ఎంచుకున్నారు. ఎప్పటిలాగానే విజేతలుగా నిలుస్తామని తెలుసు. ఈ అవకాశాన్ని ఆశావాదాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగిద్దాం' అంటూ మాన్యతాదత్ భావోద్వేగ ప్రకటన చేశారు.