Authorization
Mon Jan 19, 2015 06:51 pm
3వ స్టేజ్ లంగ్ క్యాన్సర్తో సంజరుదత్ బాధపడుతున్నారని తెలిసి ఆయనతో ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలందరూ ఆందోళనకు గురువుతున్నారు. సంజూ ప్రస్తుతం 'సడక్ 2', 'షంషేర్', 'భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా', 'కేజీఎఫ్ ఛాప్టర్ 2', 'పృథ్వీరాజ్', 'టోర్బాజ్' వంటి తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిల్లో 'సడన్ 2' ఈనెల 28న ఓటీటీ ద్వారా విడుదల కానుంది. మిగిలిన చిత్రాలన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో సదరు చిత్ర నిర్మాతలతోపాటు చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు సైతం సంజూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్లు పెట్టారు. ఇదిలా ఉంటే, బుధవారం సంజూ నటించిన 'సడక్2' చిత్ర ట్రైలర్ విడుదలైంది.