Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గుంజన్ సక్సేనా' బయోపిక్‌లో నటించడాన్ని గర్వంగా ఫీలవుతున్నా. అలాగే ఈ బయోపిక్‌లో గుంజన్ పాత్రని బాగా చేయగలదా అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. వారందరికి ఈరోజు (బుధవారం) విడుదలైన సినిమానే సమాధానం చెప్పిందని భావిస్తున్నాను' అని శ్రీదేవి తనయ జాన్వీకపూర్ చెప్పారు. తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితంలో ఆధారంగా రూపొందిన 'గుంజన్ సక్సేనా' చిత్రం బుధవారం నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. సినిమాతోపాటు గుంజన్‌గా జాన్వీ చాలా బాగా చేసిందనే ప్రశంసలు లభిస్తున్నాయి. 'ఇప్పటికైనా నా మీద కామెంట్స్ ఆగిపోతాయేమో. గుంజన్ మేడమ్ పాత్రలో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం 45 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాను. గుంజన్ పాత్ర కోసం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం, మానసికంగా సిద్ధమవ్వడం నాకంత సులభమేమీ కాలేదు. దాని కోసం పడిన కష్టాన్ని సినిమా చూశాక మరచిపోయాను. అలాగే నేను బాగా చేశానని గుంజన్ ప్రశంసించడం మరింత ఆనందంగా ఉంది' అని జాన్వీ తెలిపింది.