Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎట్టకేలకు పెద్ద సినిమాలు సైతం ఓటీటీ (ఓవర్ ది టాప్) ఫ్లాట్‌ఫామ్‌లోనే విడుదలకు సన్నద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా నాని, సుధీర్‌బాబు నటించిన 'వి' చిత్రం సెప్టెంబర్ మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుందని సమాచారం. 40 కోట్ల భారీ ఆఫర్‌తో ఈ సినిమా విడుదల హక్కుల్ని అమెజాన్ సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే సంస్థ 'వి' సినిమాని విడుదల చేయాలనుకుంది. అయితే అప్పుడు చిత్ర దర్శక, నిర్మాతలు, హీరోలు ఓటీటీలో సినిమాని విడుదల చేసేందుకు ఇష్టపడలేదు. ఆ తర్వాత 'ఆహా' ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాకి 35 కోట్ల రూపాయల్ని ఆఫర్ చేసింది. దీన్ని కూడా చిత్ర బృందం సున్నితంగా తిరస్కరిందనే వార్తలు కూడా నిన్నమొన్నటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఇదిలా ఉంటే, బాలీవుడ్లో కూడా అక్షరుకుమార్ నటించిన 'లక్ష్మీబాంబ్' సినిమా సెప్టెంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల హక్కుల కోసం డిస్నీ సంస్థ ఏకంగా 125 కోట్ల రూపాయల్ని వెచ్చించింది. ఓటీటీలో విడుదలయ్యే తొలి బాలీవుడ్ పెద్ద సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా సెప్టెంబర్ 9 అక్షరుకుమార్ పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం అదే రోజున ఈ సినిమాని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనుండటంతో అక్షరు అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అక్షరుకుమార్ సరసన కైరా అద్వానీ నటించిన ఈచిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన 'కాంచన' చిత్రానికి రీమేక్‌గా హిందీలో 'లక్ష్మీబాంబ్'గా లారెన్స్ దర్శకత్వంలోనే తెరకెక్కించారు.