Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత ప్రకాశ్ ఝా నటించిన చిత్రం 'మట్టోకి సైకిల్' చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 30 వరకు దక్షిణకొరియాలో జరిగే 25 బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఎం.గని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ మిశ్రా నిర్మించారు. దర్శక, నిర్మాతలుగా వీరిద్దరికిది తొలి సినిమా కావడం విశేషం. పాత సైకిల్‌తో జీవనోపాధిని సాగిస్తున్న ఓ పేద వ్యక్తికి కొత్త సైకిల్ కొనుక్కోవాలని ఉంటుంది. అయితే అందుకు పరిస్థితులు సహకరించవు. పైగా చాలీ చాలని సంపాదనతో భార్య, కూతురిని కూడా పోషించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పేదవాడు ఏం చేశాడు?, తన కల నెరవేర్చుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా. ఆద్యంతం హృద్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించడం విశేషం.