Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ చిత్ర పరిశ్రమలో అయినా సరే హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పారితోషికాల్లో తేడా ఉన్నప్పటికీ హీరోలకు దీటుగా రాణించడమే కాకుండా హీరోల స్థాయిలోనే తమ సినిమాల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తే స్థాయికి హీరోయిన్లు చేరుకోవడం విశేషం. అలాగే మహిళా ప్రధాన చిత్రాలతో స్టార్ హీరోల సినిమాల మాదిరిగానే కలెక్షన్ల వర్షంతో బాక్సాఫీసుల్ని సైతం షేక్ చేస్తున్నారు. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రాణిస్తున్న అగ్ర కథానాయికల్లో దీపికా పదుకొనె ఒకరు. అత్యధిక సంపాదనను ఆర్జిస్తున్న కథానాయికగా దీపిక నిలిచిందని సీఈవో వరల్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. దీపిక మొత్తం సంపాదన 65 మిలియన్ డాలర్లు (రూ.480 కోట్లు), అలాగే ఒక్కో సినిమాకి దీపికా కనీసం 14 నుంచి 18 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సీఈవో వరల్డ్ పేర్కొంది. దీపిక తర్వాత అత్యంత సంపాదన ఆర్జించిన కథానాయికలుగా ప్రియాంక చోప్రా, కరీనాకపూర్, అనుష శర్మ ఉండటం విశేషం. సినిమాల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తలుగానూ వీళ్ళు హీరోలను అధిగమించడం మరో విశేషం. ఇదిలా ఉంటే, దీపికా ప్రస్తుతం షారూఖ్ఖాన్తో కలిసి అట్లీ దర్శకత్వంలో 'సాంకీ' చిత్రంలో నటిస్తోంది. షారూఖ్, దీపికా కలిసి నటించబోయే నాలుగవ చిత్రమిది. 'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్' తర్వాత ఈ జంట మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు రెడీ అయింది. అలాగే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందబోయే పాన్ వరల్డ్ చిత్రంలోనూ దీపికా నటిస్తున్న విషయం విదితమే.