Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతల్ భట్, సూరజ్ పవన్, శ్రీరాగ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం
'ఒక అమ్మాయితో..' (కోవిడ్ టైమ్ కహాని క్యాప్షన్). ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై మురళి బోడపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది.
'కరోనా టైమ్‌లో 42 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఏమీ జరగకుండా ఇలాంటి కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ పలు జాగ్రత్తలు తీసుకుని సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడం ఓ రికార్డ్‌గా భావిస్తున్నాం. ట్రెండ్‌కి అనుగుణంగా ఉన్న మా సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాతో శీతల్భట్, సూరప్ పవన్‌లను హీరో, హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె.సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: గార్లపాటి రమేష్, డా||.వి. భట్, సంగీతం: కన్ను సమీర్, సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ, ఎడిటర్: కిషోర్ మద్దాలి, ఆర్ట్: పి.ఎస్. వర్మ, కొరియోగ్రాఫర్: భాను, రచన, దర్శకత్వం: మురళి బోడపాటి.