Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ 'అంధాదున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో నితిన్ సరసన నభా నటేష్‌ని, ఓ ముఖ్య పాత్రలో తమన్నాని ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మేర్లపాక గాంధీ దర్శకుడు.
చాలా కాలం తర్వాత హీరో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అజరుభూపతి దర్శకత్వంలో రూపొందబోయే 'మహాసముద్రం'లో ఆయన నటిస్తున్నారు.
- మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం 'మారా'. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే, మాధవన్, అనుష్క జంటగా నటించిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా ఇదే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రీమియర్ కానుంది. ఈనెల 21న ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు అమెజాన్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
- దేశంలోనే అగ్ర వ్యాపారవేత్తలుగా పేరొంది జైలు పాలైన నలుగురు ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్'. తనను చెడుగా చూపించారని సత్యం రామలింగరాజు వేసిన పిటీషన్‌తో రిలీజ్‌కి ముందే తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఈ వెబ్ సిరీస్‌ను చూడనుందని శుక్రవారం ప్రకటించింది.