Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీకేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావుకబురుచల్లగా'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్డేట్ల గురించి నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ,'టైటిల్‌తోనే అటు చిత్ర పరిశ్రమ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభించడం విశేషం. అలాగే హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్ సైతం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అందుకుంది. సెప్టెంబర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు ఉదయం 11: 47 ని.లకు వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో ఓ స్పెషల్ వీడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇక ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. త్వరలోనే చిత్రీకరణ కోసం కొత్త షెడ్యూల్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. కార్తీకేయ, లావణ్య త్రిపాఠి, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సునీల్ రెడ్డి, మ్యూజిక్ - జకీస్ బిజారు, దర్శకుడు - కౌశిక్ పెగళ్లపాటి.