Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్ సర్దార్ పటేల్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ది గోస్ట్ రిసార్ట్'. శుభోదయా ప్రొడక్షన్స్ పతాకంపై టి.లక్ష్మీ సౌజన్య గోపాల్ నిర్మిస్తున్న చిత్రమిది. ఆదివారం కథానాయకుడు అభినవ్ సర్దార్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, రక్తదానం చేశారు. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని కూడా ఆవిష్కరించారు.
కేక్ కట్ చేసిన అనంతరం ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సర్దార్ మాట్లాడుతూ,'ఈ స్పెషల్ డేని ఇంత స్పెషల్‌గా చేసినందుకు నా టీమ్ అందరికీ నా థ్యాంక్స్. నేను ఎటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినా అది కేవలం నా ఒక్కడి వల్ల మాత్రమే కాదు. నాతో పాటు నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, నా టీమ్ అండదండలు ఉండబట్టి నేను ఎలాంటి సేవా కార్యక్రమాలనైనా చేయగలుగుతున్నాను. నాకు సహాయం చేయడానికి నా వెనుక ఇంత మంది ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది' అని చెప్పారు.
దర్శకుడు సన్నీ మాట్లాడుతూ, 'నాకు పరిచయమయిన వ్యక్తుల్లో చాలా మంచి వ్యక్తి సర్దార్. కరోనా సమయంలో చాలా మందికి చాలా విధాలుగా సహాయపడ్డారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'అభినవ్ సర్దార్ మన దేశానికి చాలా సేవ చేయాలి. ఆయన మునుమ్ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయబోతున్నారు' అని నిర్మాత గోపాల్ తెలిపారు. 'సర్దార్ నాకు పరిచయమై ఐదేళ్ళయింది. ఆయన ఎప్పుడూ ఎవ్వరితోనూ రిలేషన్‌ని పోగొట్టుకోడు. ఎలాంటి వారినైనా సరే ఆదరిస్తారు. చాలా మంచి వ్యక్తి. ఇక సినిమా విషయానికొస్తే ఇదొక భిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది' అని చిత్ర దర్శకుడు సాయి రాజేష్ చెప్పారు. సన్నీ, షానీ, దర్శకుడు రాథోడ్, నటి నిధి తదితరులు పాల్గొన్ని హీరో అభినవ్ సర్దార్కి బర్త్‌డే విషెస్ చెప్పడంతోపాటు ఈ సినిమా విజయాన్ని కూడా ఆకాంక్షించారు.
అభినవ్ సర్దార్ పటేల్, మధు లగ దాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: టి. లక్ష్మీసౌజన్యగోపాల్, కో ప్రొడ్యూసర్: ఆర్. జయంతి సుబ్రమణ్యం, డిఒపి: చక్రి, మ్యూజిక్: డిజెఎస్, ఎడిటర్: శివ, డైరెక్టర్: సాయిరాజేష్.